కేపీహెచ్బీ కాలనీ, అక్టోబర్ 11 : ఏపీలోని కైకలూరు నియోజకవర్గంలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీని స్వాగతిస్తూ పలుచోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అల్లూరుకి చెందిన రెడ్డి సతీశ్ అరోరా పేరుతో గుడివాడ, సింగరాయపాలెం, అల్లూరు సెంటర్, కోరుకొల్లు, కొత్తపాల్గొని రోడ్డు, కొండేటి రోడ్డు, భీమవరం, రొడ్డువాక ప్రాంతాలలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫొటోలతో భారీ ఫ్లెక్సీలు వెలిశాయి.
రెడ్డి సతీశ్ అరోరా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని యావత్ దేశ ప్రజానీకం కోరుకుంటున్నదని చెప్పారు. ఏపీతో పాటు పలు రాష్ర్టాలలో బీఆర్ఎస్ను స్వాగతిస్తున్నట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ కేంద్ర రాజకీయాలను శాసించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రైతులకు, కార్మికులకు, పేదలకు, మహిళలకు, మైనార్టీలకు మేలు జరగాలంటే సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు అవసరమని పేర్కొన్నారు.