కాంగ్రెస్ మోసాలపై బీఆర్ఎస్ సమరశంఖం
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలుచేయకుండా ప్రజలను మోసం చేయడంపై బీఆర్ఎస్ ప్రజాక్షేత్రంలో పోరాటానికి సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్ ఎస్ అధిష్ఠానం పిలుపు మేరకు సెప్టెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు గులాబీ పార్టీ నేతలు తెలిపారు.
- 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసనలు
- ఆరు గ్యారెంటీలతోపాటు, 420 హామీల అమలుపై నిలదీతలు
- భూపాలపల్లి, నాగర్‌కర్నూల్, మెదక్, నిజామాబాద్‌లో పార్టీ శ్రేణులకు నేతల దిశానిర్దేశం
హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలుచేయకుండా ప్రజలను మోసం చేయడంపై బీఆర్ఎస్ ప్రజాక్షేత్రంలో పోరాటానికి సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్ ఎస్ అధిష్ఠానం పిలుపు మేరకు సెప్టెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు గులాబీ పార్టీ నేతలు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేసే వరకు పోరాటం కొనసాగించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని సూచించారు. బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు హైదరాబాద్‌లో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి నివాసంలో ఉమ్మడి మెదక్ జిల్లా పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యా రు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమల్లో విఫలమైన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన నిరసనలపై దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ వెయ్యి రోజులపాలన ప్రజల పాలిట శాపంగా మారిందని విమర్శించారు. హామీలు అమలు చేయకుండా ప్రజలను దగా చేసిన కాంగ్రెస్‌కు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్పాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ప్రజలను మోసగిస్తున్న కాంగ్రెస్ సర్కార్
420 హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తున్నదని, ఈ విషయంలో ప్రజలను మరింత చైతన్యపరచాలని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. మిర్యాలగూడ బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాసర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డి, తిప్పన విజయసింహారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ 3న నిర్వహించే రైతు సదస్సుల్లో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారని వెల్లడించారు.
- నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోనూ కాంగ్రె స్ ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరశంఖం పూరించింది. ఏడు రోజులపాటు నియోజకవర్గవ్యాప్తంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
- కాంగ్రెస్ వెయ్యి రోజుల కాంగ్రెస్ దగా పాల న ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ పార్టీ రణభేరి మోగించేందుకు సిద్ధమైందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. సోమవారం భూపాలపల్లిలో బీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడా రు. కాంగ్రెస్ పాలనలో రైతులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలకు ఎంత బాకీ పడ్డదో బాకీ కార్డులు ఇంటింటికి పంచుతూ 420 అడుగుల ఫ్లెక్సీ ప్రదర్శిస్తామని తెలిపారు.
- రేవంత్ సర్కార్ రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పాలనపై రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని అన్నారు. నిజామాబాద్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలను అమలుచేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరం గా విఫలమైందని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

