అన్నదమ్ముల మధ్య కత్తులతో దాడులు.. అన్న కుమారుడి తలకు తీవ్రగాయం!
ఇంటి బాట వద్ద మొదలైన చిన్నపాటి వివాదం అన్నదమ్ముల మధ్య కత్తులు, కర్రలతో దాడులకు దారితీసింది. పరస్పరం దాడులు చేసుకోవడంతో ఒకరికి చేయి విరగ్గా.. మరొకరికి తలకు తీవ్ర గాయమైంది.
దుగ్గొండి, నవంబర్ 14: ఇంటి బాట వద్ద మొదలైన చిన్నపాటి వివాదం అన్నదమ్ముల మధ్య కత్తులు, కర్రలతో దాడులకు దారితీసింది. పరస్పరం దాడులు చేసుకోవడంతో ఒకరికి చేయి విరగ్గా.. మరొకరికి తలకు తీవ్ర గాయమైంది. ఈ ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవి రంగాపురం గ్రామంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది.
స్థానిక ఎస్సై మసిరెడ్డి మహేందర్, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. అడవి రంగాపురం గ్రామానికి చెందిన బుడిమె శ్రీనివాస్, రవీందర్ అన్నదమ్ములు. శనివారం ఉదయం ఇంటి బాట వద్ద వీరి మధ్య వివాదం తలెత్తింది. మాటామాటా పెరగడంతో ఇరువర్గాలు కత్తులు, కర్రలతో పరస్పరం దాడులకు దిగాయి. ఈ ఘటనలో తమ్ముడు శ్రీనివాస్ చేయి విరిగింది. అనంతరం శ్రీనివాస్ కుటుంబ సభ్యులు తిరిగి దాడి చేయడంతో అన్న కుమారుడు దినేశ్ తలకు తీవ్ర గాయమైంది.
వెంటనే స్పందించిన స్థానికులు, కుటుంబ సభ్యులు గాయపడిన దినేశ్‌ను అంబులెన్స్‌లో వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దాడికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అన్నదమ్ముల మధ్య కత్తులతో దాడులు.. అన్న కుమారుడి తలకు తీవ్రగాయం!
Guptha Padmasana | గుప్త పద్మాసనం అంటే ఏమిటి.. ఎలా వేయాలి.. దీని వల్ల కలిగే లాభాలేమిటి..?
IND vs PAK | దాయాదుల సమరం.. అండర్-19 ఆసియాకప్ ఫైనల్లో టాస్ గెలిచిన పాక్!
Bilal Kazi: 70 మంది అమ్మాయిలకు వేధింపులు.. బ్రిటన్‌లో భారతీయుడికి 30 ఏళ్ల జైలుశిక్ష
Dhanush | ధనుష్ ‘ఓఎం’ ట్రైలర్లో ‘ధురంధర్’, ‘అవతార్’ ఛాయలు.. కథపై ఆసక్తికర చర్చ!
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

