హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అత్యంత కీలకమైన రెండు థర్మల్ విద్యుత్తు ప్లాంట్లల్లో ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. దీంతో 1,320 మెగావాట్ల విద్యు త్తు ఉత్పత్తి నిలిచిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్‌లో ఉద్యోగుల మెరుపు సమ్మె, వార్షిక మరమ్మతు ల వల్ల 250 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి ఆగిపోయింది. ఇదే ప్లాంట్‌లో బాయిలర్ ట్యూబు లీకేజీ సమస్య తలెత్తడంతో మరో 800 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. మణుగూరులోని బీటీపీఎస్‌పై పిడుగు పడటంతో 270 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోయింది.
4 వేల మెగావాట్లకుపైగా విద్యు త్తు థర్మల్ కేంద్రాల్లోనే ఉత్పత్తి అవుతున్నది. ఇందులో 1,320 మెగావాట్ల ఉత్పత్తికి అంతరాయం కలగడంతో రాష్ట్ర గ్రిడ్‌కు అందే విద్యుత్తులో కొరత ఏర్పడింది. బీటీపీఎస్ ప్లాంట్ పునరుద్ధరణకు 2 నెలలు, కేటీపీఎస్ ప్లాంట్ పునరుద్దరణకు 15 రోజుల సమయం పడుతుంది. విద్యుత్తు డిమాండ్ ఆదివారం 6,78 8 మెగావాట్లుగా ఉండగా.. సోమవారం 1,000 మెగావాట్లు పెరిగి 7,790 మెగావాట్ల కు చేరింది. ఈ డిమాండ్ మరింత పెరిగితే విద్యుత్తు కష్టాలు తప్పవు.
మేడిగడ్డ మరమ్మతులకు వరద బ్రేక్
ఖరీఫ్‌లో వర్షంపైనే ఆధారం తల్లడిల్లుతున్న అన్నదాతలు
జయశంకర్ భూపాలపల్లి, జూలై 1 (నమస్తే తెలంగాణ): ఎగువన కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో టెస్టింగ్ పనులకు బ్రేక్ పడింది. ప్రాణహిత నది ప్రవాహం ఎక్కువ కావడంతో మేడిగడ్డ వద్ద పనులు ముందుకెళ్లడం లేదు. ఎప్పటికప్పుడు నీటిని వదులుతున్నప్పటికీ గేట్ల వద్ద పేరుకుపోతున్న నీటితో పనులు నిలిచిపోయాయి. సీసీ బ్లాకుల పనులు మధ్యలోనే ఆగిపోయాయి. నిర్మాణ సంస్థలు చేతులెత్తేశాయి. నారు పోసే దశలో రైతులు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. అన్నారం, సుందిళ్ల నుంచి 500 క్యూసెక్కుల వరద, మేడిగడ్డ నుంచి 11,740 క్యూసెక్కుల ప్రాణహిత నీరు ప్రవహిస్తుండగా అంతే నీటిని కిందికి పంపుతున్నారు. మేడిగడ్డలో కరకట్టను అధికారులు తొలగిస్తున్నారు.