హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ) : విద్యారంగంలో చేస్తున్న విశేష కృషికి గుర్తింపుగా ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు నందిని, వాల్మీకి విద్యాసంస్థల అధినేత యాదగిరి శేఖర్‌రావు బ్రెయిన్ ఫీడ్ ఎడ్యు లీడర్ పురస్కారం అందుకొన్నారు. బుధవారం హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చేతుల మీదుగా శేఖర్‌రావు అవార్డును అందుకొన్నారు.