బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
రాష్ట్రంలోని బ్రాహ్మణుల సంక్షేమ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బ్రాహ్మణ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రీరాంభట్ల దీపక్బాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఫెడరేషన్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణుల సంక్షేమానికి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు.
- బ్రాహ్మణ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రీరాంభట్ల దీపక్బాబు
కరీంనగర్ తెలంగాణచౌక్, నవంబర్ 15: రాష్ట్రంలోని బ్రాహ్మణుల సంక్షేమ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బ్రాహ్మణ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రీరాంభట్ల దీపక్బాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఫెడరేషన్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణుల సంక్షేమానికి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. ప్రత్యేక కార్పొరేషన్తో పాటు రూ.500 కోట్లు కేటాయించాలని,. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ప్రతి ఆలయంలో ధూపదీప నైవేద్యం పథకాన్ని వర్తింపచేయాలని, ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకు రుణాలను ఇప్పించాలని, దేవాలయ భూముల పరిరక్షణ కమిటీని నియమించాలని, దేవాలయాల పోషణ కోసం అప్పటి పాలకులు ఇచ్చిన దేవాలయ భూము వివరాలను ప్రతి ఆలయం ఎదుట ప్రదర్శించాలని, భక్తులు సమర్పిస్తున్న డబ్బులు ధార్మిక, దేవాలయ నిర్మాణాల కోసం మాత్రమే వినియోగించేలా చట్టాలను రూపొందించాలని డిమాండ్ చేశారు. వేలాది ఎకరాల దేవాలయ భూములు అన్యాక్రాంతం చేస్తున్నారని ఆరోపించారు. సమాజ శ్రేయస్సు కోరుకునే బ్రాహ్మణులను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. త్వరలోనే రాష్ట్రంలోని ప్రతి దేవాలయాన్నీ సందర్శించి భూములు, ఆదాయాలను సేకరించి రాష్ట్ర ప్రజలు ముందు పెడుతామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలోని పురాతన దేవాలయాల జీర్ణోద్ధరణకు నిధులు కేటాయించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

