హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని 18 డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 16 నుంచి జనవరి 5 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు.
మల్టీ జోన్-1లో ఐదు పోస్టులను, మల్టీ జోన్ -2లో 13 పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. డిగ్రీలో ఫార్మసీ, ఫార్మాస్యూటికల్ సైన్స్, ఫార్మా డీ, క్లినికల్ ఫార్మకాలజీ, మైక్రోబయోలజీ చేసిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. వివరాలకు https://www. tspsc.gov.inలో సంప్రదించాలి.