జగిత్యాల కలెక్టరేట్, ఆగస్టు 22: హాస్టల్లో ఉండడం ఇష్టం లేక ఓ బాలుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన జగిత్యాలలో జరిగింది. ఏపీకి చెందిన ఓ వ్యక్తి జగిత్యాల పట్టణంలో పనిచేస్తూ.. తన కొడుకును స్థానికంగా ఓ ప్రైవేటు స్కూల్ హాస్టల్లో చేర్పించాడు. శుక్రవారం హాస్టల్ నుంచి తప్పించుని బయటకు వచ్చిన బాలుడు.. బస్ డిపో వద్ద బస్సు కింద పడేందుకు యత్నించాడు.
స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు వారించి కాపాడారు. హోంగార్డు లక్ష్మీనారాయణ బాలుడిని ట్రాఫిక్ పీఎస్కు తీసుకెళ్లగా, హాస్టల్లో ఉండడం ఇష్టంలేదని తెలిపాడు.