సుబేదారి, మే 21: హనుమకొండ కాళోజీ జంక్షన్‌లోని వరంగల్ జిల్లా కలెక్టరేట్, సుబేదారిలోని హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయంలో బాంబు పెట్టామని బుధవారం ఓ అగంతకుడు వరంగల్ పోలీసు కమిషనరేట్‌లోని ఓ అధికారికి ఫోన్ చేశాడు.
దీంతో బాంబు, డాగ్ స్క్వా డ్ పోలీసులు రంగంలోకి దిగారు. హుటాహుటిన రెండు జిల్లాల కలెక్టరేట్లకు చేరుకొని విస్తృతంగా తనిఖీలు చేశారు. బాంబులు కనిపించకపోవడంతో అది బెదిరింపు కాల్‌గా నిర్ధారణ కావడంతో అధికారులు, ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.