రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్ వేదికగా బాలీవుడ్ నటుడు సోనూసూద్ ప్రశంసించారు. కేటీఆరే నిజమైన హీరో అంటూ కొనియాడారు. కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని సోనూసూద్ పేర్కొన్నారు.
అయితే నంద కిశోర్ తోకల అనే ఓ నెటిజన్ కేటీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశాడు. తాము సంప్రదించిన 10 గంటలలోపే తమకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ సమకూర్చారని, ఆ మేలు ఎప్పటికీ మరిచిపోలేమని అతను పేర్కొన్నాడు. అదే ఒరవడిని తెలంగాణ ప్రజల కోసం కొనసాగించడం అభినందించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా తాను చెప్పదలుచుకున్నది ఒక్కటే.. అదేంటంటే నిజమైన సూపర్ హీరో కేటీఆర్ అని నంద కిశోర్ ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. తాను ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడిని, తనకు చేతనైనంతా సహాయం చేస్తున్నాను. సూపర్ హీరో తాను కాదు. సూపర్ హీరో అని మీరు సోనూసూద్‌ను పిలవచ్చు అని కేటీఆర్ రీట్వీట్ చేశారు.
ఈ ట్వీట్‌పై సోనూసూద్ స్పందిస్తూ.. కేటీఆర్‌కు థ్యాంక్స్ చెప్పారు. కానీ తెలంగాణ ప్రజల కోసం ఎంతో చేస్తున్న మీరే నిజమైన హీరో. మీ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతోంది. తెలంగాణను నా రెండో ఇల్లుగా నేను పరిగణిస్తున్నాను. గత కొన్ని సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలు నాపై ప్రేమ, అభిమానం చూపిస్తున్నారని సోనూసూద్ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్‌పై కేటీఆర్ స్పందిస్తూ.. సోనూసూద్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మీరు చేస్తున్న పని చాలా గొప్పది. మీరు కోట్లాది మందికి ఆదర్శమని కేటీఆర్ రీట్వీట్ చేశారు.
Many thanks brother @SonuSood Ji for your kind words 🙏
— KTR (@KTRTRS) June 1, 2021
Keep doing the great work that you have started. You are inspiring millions of people https://t.co/TPeyjSxfcr
Thank you so much sir for your kind words! But you are truly a hero who has done so much for Telengana. The state has developed so much under your leadership. I consider Telengana as my second Home as its my place of work & the people have shown me so much love over the years🇮🇳 https://t.co/8LG65I0G01
— sonu sood (@SonuSood) June 1, 2021