శక్కర్‌నగర్, మే 6:సివిల్ కేసు నుంచి పేరును తొలగించేందుకు లంచం తీసుకుంటున్న ఎస్సైని ఏసీబీ పట్టుకున్న ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్‌లో బుధవారం చోటుచేసుకున్నది. ఏసీబీ డీఎస్సీ శేఖర్‌గౌడ్ తెలిపిన వివరాల మేరకు.. బోధన్ టౌన్ పోలీసుస్టేషన్లో మార్చి నెలలో నమోదైన ఓ సివిల్ కేసులో పోలీసులు కొంత మందికి నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ఉన్న ఓ ప్రజాప్రతినిధికి చెందిన సోదరుడి కుమారుడి పేరును తొలగించేందుకు గాను ఎస్సై చితన్నోజు భాస్కరాచారి రూ.10 లంచం డిమాండ్ చేశారు. చివరకు రూ.7 వేలకు ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో బాధితుడు బుధవారం ఠాణాకు వెళ్లి ఎస్సైని కలిసి రూ.7 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.