హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఉన్న 17 బ్లాక్ స్పాట్లలో జరుగుతున్న ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలు తీసుకుంటామని రోడ్డు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. శుక్రవారం సచివాలయంలో ఆ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఆయా ప్రాంతాల్లో సైన్ బోర్డులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. భారీ వేగ నిరోధం, ఆరు లేన్ల రోడ్డు నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి, వీయూపీల నిర్మాణం, రోడ్డుకు ఇరువైపులా సర్వీస్ రోడ్ల నిర్మాణం వంటి చర్యలతో ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. ఈ సమీక్ష సమావేశానికి జాతీయ రహదారుల శాఖ అధికారులు కూడా హాజరయ్యారు.