Home
Telangana
Bjp Union Minister Bandi Sanjays Controversial Comments On Hydra Demolishing The Houses Of The Poor Familys
Bandi Sanjay | హైడ్రా బాధితులది దొంగ ఏడుపు.. కన్నీళ్లు రాకున్నా కండ్లు తుడుచుకుంటున్నరు: బండి సంజయ్
బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన హైడ్రా పేదల ఇండ్లను కూల్చేస్తుంటే.. ఆ కూల్చివేతల బాధిత కుటుంబాలవి దొంగ ఏడుపులంటూ వెటకారంగా మాట్లాడారు.
- దాన్ని పెద్దపెద్ద స్క్రీన్లు పెట్టి ప్రచారం చేస్తున్నరు
- బాధితుల కష్టాలను ఎగతాళి చేసిన కేంద్ర మంత్రి
- సోషల్ మీడియాలో మండిపడుతున్న నెటిజన్లు
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 8(నమస్తే తెలంగాణ): బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన హైడ్రా పేదల ఇండ్లను కూల్చేస్తుంటే.. ఆ కూల్చివేతల బాధిత కుటుంబాలవి దొంగ ఏడుపులంటూ వెటకారంగా మాట్లాడారు. జూబ్లీహిల్స్ పరిధిలోని షేక్పేటలో శనివారం జరిగిన బీజేపీ రోడ్షోలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పెద్ద స్క్రీన్లు పెట్టి ఆ ఏడుపులను ప్రచారం చేస్తున్నరని, వాళ్ల ఏడుపులన్నీ నటన అని వ్యాఖ్యానించారు. ఏడుపురాకున్నా కండ్లు తుడుచుకుంటరని ఎద్దేవా చేశారు. హైడ్రా తీసుకొచ్చిన సీఎం రేవంత్రెడ్డి అన్నీ హిందువుల ఇండ్లనే కూలగొడ్తున్నరని అంటూనే, హైడ్రాతో ఇండ్లు కోల్పోయిన బాధితుల కష్టాలను చూసి ఎగతాళి చేయడంపై విస్మయం వ్యక్తమవుతున్నది. హైడ్రా బాధితులపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిప డుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

