గంగాధర, మార్చి 29: వరద కాలువకు నీటిని విడుదల చేసి, ఎండిపోతున్న పంటలను కాపాడాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం క రీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల వరద కాలువ వద్ద జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారిపై రైతులతో కలిసి బీజేపీ నాయకులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా బీజేపీ చొప్పదండి నియోజకవర్గ కన్వీనర్ పెరుక శ్రావణ్ మాట్లాడుతూ.. వరద కాలువను నమ్ముకొని రైతులు వేలాది ఎకరాల్లో పం టలు సాగు చేసినట్టు తెలిపారు. కాలువలో నీరు అడుగంటడంతో పంటలు ఎండిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే వరద కాలువకు నీళ్లివ్వాలని, రైతులు నష్టపోకుండా చూడాలని కోరారు.