హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఓట్లు దండుకొనేందుకే కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ విమర్శించారు. సోమవారం ఆయన ఘట్కేసర్లోని వీబీఐటీ క్యాంపస్‌లో నిర్వహించిన వికసిత్ భారత్ స్టూడెంట్స్ కాంక్లేవ్‌లో మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కాంగ్రెస్ సర్కార్ విద్యార్థులను నట్టేట ముంచిందని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో జాప్యం కారణంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తంచేశారు. దేశంలో స్టార్టప్‌ల వృద్ధికి అనుకూలమైన వాతావరణం ఉన్న ప్రాంతాల్లో హైదరాబాద్ ఒకటి అని చెప్పారు.