ధర్పల్లిలో ఉద్రిక్తత.. పసుపు రైతులపై బీజేపీ కార్యకర్తల దాడి
Dharpally | ధర్పల్లిలో (Dharpally) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ కార్యకర్తలు, పసుపు రైతులకు మధ్య ఘర్షణ చోటుకున్నది. దీంతో బీజేపీ కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో ధర్పల్లి ఎస్సై వంశీకృష్ణారెడ్డి గాయపడ్డారు.
నిజామాబాద్: జిల్లాలోని ధర్పల్లిలో (Dharpally) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ కార్యకర్తలు, పసుపు రైతులకు మధ్య ఘర్షణ చోటుకున్నది. దీంతో బీజేపీ కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో ధర్పల్లి ఎస్సై వంశీకృష్ణారెడ్డి గాయపడ్డారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణకు ఎంపీ ధర్మపురి అరవింద్ వస్తున్నాడని తెలుసుకున్న పసుపు రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి వచ్చారు. దీంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు వేదిక వద్దకు భారీగా చేరుకున్నారు.
పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన ఎంపీ అరవింద్.. సమాధానం చెప్పాలంటూ పసుపు రైతులు డిమాండ్ చేశారు. ఇరు వర్గాలు పోటాపోటీ నినాదాలు చేయడంతో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈక్రమంలో రైతులు, టీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరుపక్షాలను చెదరగొట్టారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో ధర్పల్లి ఎస్సై వంశీకృష్ణా రెడ్డి తలకు గాయమయింది. పోలీసులు ఆయనను దవాఖానకు తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Attack
- BJP
- dharpally
- IS Injured
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

