హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): నకిలీ ఐఎస్ఐ ముద్రలతో ఉత్పత్తులు తయారు చేస్తున్న ఓ పరిశ్రమలో భారతీయ ప్రమాణాల బ్యూరో(బీఐఎస్) అధికారులు సోదాలు నిర్వహించారు. మంగళవారం సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో ఈ సోదాలు జరిగాయి.
నకిలీ ఐఎస్ఐ ముద్రలతో ఇంటి తలుపులకు వాడే స్టీల్ హింజ్స్ తయారు చేస్తూ మార్కెట్కు సరఫరా చేస్తున్నారన్న సమాచారంతో అధికారులు సోదాలు నిర్వహించారు. ఉత్పత్తులతో పాటు నకిలీ ఐఎస్ఐ ముద్రులు ఉన్న ప్యాకింగ్ లేబుల్ అట్టలనూ సీజ్ చేసినట్టు బీఐఎస్ హైదరాబాద్ శాఖాధిపతి పీవీ శ్రీకాంత్ తెలిపారు.