హైదరాబాద్, ఫిబ్రవరి 20(నమస్తే తెలంగాణ): ఔషధాలు, లైఫ్ సైన్సెస్ రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభు త్వం నిర్వహించే బయో ఏషియా వార్షిక సదస్సు ఈ నెల 25, 26 తేదీల్లో హెచ్ఐసీసీలో జరుగనుంది. ఈ సారి సదస్సు ఏఐ ఆధారిత ఆరోగ్య పరిరక్షణ, క్లినికల్ పరిశోధనలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుందని నిర్వాహకులు తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, క్వీన్స్లాండ్ గవర్నర్ జెన్నెట్ యంగ్, జీ 20 షెర్పా అమితాబ్ కాంత్ తదితరులతోపాటు వివిధ బహుళజాతి కంపెనీల అధిపతులు, ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొంటారు.