హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): మావోయిస్టు పార్టీకి మరో గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) కొత్త చీఫ్ బర్సే దేవా తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
హిడ్మా తర్వాత పీఎల్జీఏకి నాయకత్వం వహిస్తున్న బర్సే దేవాతోపాటు తెలంగాణ-ఛత్తీస్గఢ్-మహారాష్ట్ర సరిహద్దుల్లో భద్రా ద్రి కొత్తగూడెం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఇటీవల మారేడుమిల్లిలో ఎన్కౌంటర్లో మృతిచెందిన హిడ్మాకు దేవా సమకాలికుడు. వారిద్దరిదీ ఒకటే గ్రామం.