బీబీనగర్ ఎయిమ్స్‌లో హెల్త్ అండ్ హ్యాపీనెస్ క్లినిక్ ప్రారంభం

యాదాద్రి భువనగిరి : ప్రజలకు మానసిక ఆరోగ్య సేవలను అందించేందుకు అదేవిధంగా వ్యక్తిగత, కుటుంబ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి బీబీనగర్ ఎయిమ్స్‌లోని కమ్యూనిటీ మెడిసిన్ అండ్ ఫ్యామిలీ మెడిసిన్ విభాగం శనివారం తన ప్రాంగణంలో హెల్త్ అండ్ హ్యాపీనెస్ క్లినిక్‌ను ప్రారంభించింది. క్లినిక్ ప్రారంభం అనంతరం ఎంపీ డాక్టర్ బండా ప్రకాశ్ మాట్లాడుతూ.. హెల్త్ అండ్ హ్యాపీనెస్ క్లినిక్ ఏర్పాటు చేయడంపై ఎయిమ్స్ ను ఆయన ప్రశంసించారు. ప్రస్తుత కొవిడ్-19 మహమ్మారి పరిస్థితుల్లో ప్రజల్లో ఆందోళన, నిరాశ పెరిగిందన్నారు. మహమ్మారి వల్ల కలిగే ఆందోళన నుండి ఉపశమనం పొందడానికి ప్రజలకు ఈ క్లినిక్ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
ఎయిమ్స్ ఈడీ డాక్టర్ వికాస్ భాటియా మాట్లాడుతూ.. హెల్త్ అండ్ హ్యాపినెస్ క్లినిక్ ధ్యానం, యోగా సేవలు, మైండ్‌ఫుల్‌నెస్, రిఫరల్స్, వ్యక్తి లేదా కుటుంబం మానసిక ఆరోగ్యంపై కౌన్సిలింగ్, కన్సల్టింగ్ వంటి సమగ్ర సేవలను అందిస్తుందన్నారు. ఆత్మహత్య నివారణకు గాను సేవలు అందించేందుకు 24 గంటల హెల్ప్‌లైన్‌తో పాటు మ్యూజిక్ థెరపీ, సానుకూల మానసిక ఆరోగ్యం, ఒత్తిడి, ఆందోళన, నిరాశకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆందోళన, నిరాశను ఎదుర్కొంటే కౌన్సిలింగ్ తీసుకునేందుకు ప్రజలు వెనుకాడవద్దన్నారు. ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు జూన్ 21 న ఎయిమ్స్ ప్రాంగణంలో కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

