IAS – IPS Transfers : తెలంగాణలో మరోసారి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. నలుగురు ఐఏఎస్‌లు, 20 మంది ఐపీఎస్‌లకు స్థాన చలనం కల్పిస్తూ శనివారం చీఫ్ సెక్రటరీ కే.రామకృష్ణారావు (K.Ramakrishna Rao) ఉత్తర్వులు జారీ చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్ట ఈవోగా భవనీ శంకర్ నియమితులయ్యారు. ఇదివరకూ ఆయన గవర్నర్‌కు సంయుక్త కార్యదర్శిగా సేవలందించారు.
ప్రభుత్వ, ఆర్ధిక శాఖ ప్రత్యేక సెక్రటరీ కే.హరిత (2013 బ్యాచ్) కుమ్రంభీమ్ అసిఫాబాద్ జిల్లాకు కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఎంసీఆర్హెచ్ఆర్డీ జాయింట్ డైరెక్టర్ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్న కె.నిఖిల(2015 బ్యాచ్) మత్స్య శాఖ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ సీఈఓగా వెంకటేశ్ ధోత్రే బదిలీ అయ్యారు.
తెలంగాణలో మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీలు https://t.co/zGhEGsOx7x pic.twitter.com/QJvI1qBrTs
— Telugu Scribe (@TeluguScribe) January 17, 2026
ఐపీఎస్‌ల బదిలీల విషయానికొస్తే.. సైబరాబాద్ పోలీస్, ట్రాఫిక్ సంయుక్త కమిషనర్‌గా సేవలందిస్తున్న గజరావు భూపాల్(2008 బ్యాచ్) ప్రొవిజనింగ్, లాజిస్టిక్స్ ఐజీగా నియమితులయ్యారు. నార్కోటిక్స్ బ్యూరో ఐజీగా పనిచేస్తున్న అభిషేక్ మహంతి(2011 బ్యాచ్) విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్‌గా బదిలీ అయ్యారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ డీసీపీగా శివం ఉపాధ్యాయ(2021 బ్యాచ్) వెళ్లనున్నారు.
తెలంగాణలో మరోసారి భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు
వారాల వ్యవధిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీలు చేస్తున్న ప్రభుత్వం pic.twitter.com/Gw6vaavBpi
— Telugu Scribe (@TeluguScribe) January 17, 2026