రోహిత్ వేముల’ ముసాయిదా బిల్లు సిద్ధం చేయండి
రోహిత్ వేముల తెలంగాణ ముసాయిదా బిల్లును మూడు నెలల్లోగా సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఆదేశించారు.
- అధికారులకు ఉపముఖ్యమంత్రి భట్టి ఆదేశం
హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): రోహిత్ వేముల తెలంగాణ ముసాయిదా బిల్లును మూడు నెలల్లోగా సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఆదేశించారు. బిల్లు కోసం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయడంతోపాటు, న్యాయ, విద్యా, హోంశాఖలు, యూజీసీ భాగస్వామ్యంతో కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు.
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల హకులను పరిరక్షిస్తూ, కులం, సామాజిక నేపథ్యం ఆధారంగా వివక్షకు తావులేకుండా సమగ్ర చట్టాన్ని రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ప్రతిపాదిత ‘రోహిత్ వేముల తెలంగాణ బిల్లు’కు సంబంధించి డిప్యూటీ సీఎం అధ్యక్షతన క్యాబినెట్ సబ్కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సచివాలయంలో శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమైంది.
మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్మణ్కుమార్ హాజరయ్యారు. ప్రతిపాదిత బిల్లు రూపకల్పనకు అనుసరించాల్సిన విధానం, కమిటీ కూర్పు, న్యాయపరమైన అంశాలు, వివిధవర్గాలతో సంప్రదింపుల ప్రక్రియపై విసృ్తతంగా చర్చించారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రాథమిక ముసాయిదాను 3 నెలల్లోగా సిద్ధం చేసి సీనియర్ సివిల్ సర్వెంట్ల కమిటీ (సీఎస్సీ)కి సమర్పించాలని సూచించారు.
‘రోహిత్ వేముల చట్ట రూపకల్పన ప్రక్రియకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ(ఎస్సీడీడీ) నాయకత్వం వహించాలని, అవసరమైన సంబంధిత శాఖలు, సంస్థలకు కమిటీలో ప్రాతినిధ్యం కల్పించాలని, న్యాయశాఖను భాగస్వామిగా చేర్చి వీలైనంత త్వరగా కార్యాచరణ ప్రారంభించాలని ఆదేశించారు. అవసరమైన న్యాయపరమైన, సాంకేతిక అంశాల్లో నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం సహకారం తీసుకోవాలని నిర్ణయించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

