హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) కంపెనీ కొత్త వర్క్ మాన్యువల్-2023ని వి డుదల చేసింది. బీడీఎల్ డైరెక్టర్ (ప్రొడక్షన్), సీఎండీ (అడిషనల్ చార్జ్) పీ రాధాకృష్ణ గురువారం కంచన్‌బాగ్ యూనిట్లో విడుదల చేశారు.
టెండరింగ్, పనుల అమలు, కన్సల్టెంట్ల నియామకంలో ఎగ్జిక్యూటివ్‌లకు ఈ వర్క్ మాన్యువల్ మార్గనిర్దేశం చేస్తుంది. 2017 మాన్యువల్‌కు అనుగుణంగా 2023 మాన్యువల్‌ను సవరించినట్లు సీఎండీ తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్ (ఫైనాన్స్) ఎన్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.