హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): ఇంటర్నెట్ వినియోగం రోజువారీ జీవితంలో భాగమవడంతో ఆన్లైన్ మోసాలు నానాటికీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ-మెయిల్స్ సహా సోషల్ మీడియా ఖాతాలు, ఆన్లైన్ బ్యాకింగ్ ఖాతాల యూజర్‌నేమ్‌లు, పాస్‌వర్డ్‌లను బ్రౌజర్లలో స్టోర్ చేయడం సరికాదని, అలా చేస్తే హ్యాకర్లు కనిపెట్టే ప్రమాదం ఉన్నదని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కంప్యూటర్లో ఇంటర్నెట్ వాడిన తర్వాత బ్రౌజింగ్ హిస్టరీని క్లియర్ చేసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.