మహిళపై ఎలుగుబంటి దాడి.. ఎదురుదాడికి దిగిన యజమాని పెంపుడు శునకం
ఎలుగుబంటి దాడి నుంచి యజమానురాలిని కాపాడేందుకు ఓ పెంపుడు శునకం గొప్ప పోరాట పటిమ కనబరిచింది. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం చెంచుగూడెంలో చోటుచేసుకున్నది.
- కుక్కకు భయపడి అడవిలోకి వెళ్లిన భళ్లూకం
- పెంపుడు కుక్కే కాపాడిందన్న బాధితురాలు నిమ్మల సాలమ్మ
అచ్చంపేట, మే 24 : ఎలుగుబంటి దాడి నుంచి యజమానురాలిని కాపాడేందుకు ఓ పెంపుడు శునకం గొప్ప పోరాట పటిమ కనబరిచింది. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం చెంచుగూడెంలో చోటుచేసుకున్నది. బాధితుల కథనం మేరకు.. చెంచుగూడెం గ్రామానికి చెందిన చెంచు మహిళ నిమ్మల సాలమ్మ, చంద్రయ్య దంపతులు ఆదివారం మేకలను మేపేందుకు అటవీ ప్రాంతానికి వెళ్లారు. గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని పవనకుంట అడవిలో మేకలను తోలుకుంటూ వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా ఎలుగుబంటి సాలమ్మపై దాడికి తెగబడింది.
ఈ క్రమంలో చంద్రయ్య కూడా భయపడటంతో ఆ సమయంలో వారి వెంట వచ్చిన పెంపుడు శునకం ఎలుగుబంటిపై మొరుగుతూ దానిచుట్టూ తిరుగుతూ ఎదురుదాడి చేయడానికి ప్రయత్నించింది. శునకం అరుపులు, చంద్రయ్య కేకలతో ఎలుగుబంటి కంగారుపడి చివరకు సాలమ్మను వదిలి అడవిలోకి పారిపోయింది.
‘మా కుక్క లేకపోతే నా భార్య ప్రాణాలతో బయటపడేది కాదు’ అంటూ సాలమ్మ భర్త వాచర్ రాములు భావోద్వేగానికి గురయ్యాడు. ఎలుగుబంటి దాడిలో సాలమ్మ భుజం, చెంప, చెవి భాగాల్లో గాయాలయ్యాయి. ఆమెను అచ్చంపేటలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించి చికిత్స చేయించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

