వనపర్తి : అకాల వర్షాలతో అప్రమత్తంగా ఉండాలనివ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం ప్రజాప్రతినిధులు, అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామాల్లో బలహీనంగా ఉన్న ఇళ్లను గుర్తించి మంత్రి క్యాంపు కార్యాలయం, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
ప్రజాప్రతినిధులు గ్రామ కార్యదర్శులతో కలిసి పాత ఇండ్లను గుర్తించాలి. చెరువులు, కుంటలు కాలువలు, ఇరిగేషన్ కాలువల్లో నీళ్లు పారేలా చూడాలన్నారు.అలాగే పారిశుద్ధ్య పనులపై దృష్టిసారించి,
ఎక్కడా నీళ్లు ఆగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూంచించారు. అధికారులు ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని ఎలాంటి ప్రమాదాలుతలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.