9న బీసీ సామాజిక న్యాయపోరాట సభ.. బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరమ్ అధ్యక్షుడు చిరంజీవులు వెల్లడి
బీసీ సామాజిక న్యాయపోరాట సభ వచ్చేనెల 9న నల్లగొండ జిల్లాలో నిర్వహించనున్నామని బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరమ్ (బీసీఐఎఫ్) అధ్యక్షుడు చిరంజీవులు వెల్లడించారు. భావజాల ప్రచారం నుంచి ప్రజా ఉద్యమాల దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ) : బీసీ సామాజిక న్యాయపోరాట సభ వచ్చేనెల 9న నల్లగొండ జిల్లాలో నిర్వహించనున్నామని బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరమ్ (బీసీఐఎఫ్) అధ్యక్షుడు చిరంజీవులు వెల్లడించారు. భావజాల ప్రచారం నుంచి ప్రజా ఉద్యమాల దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరమ్ రెండవ వార్షికోత్సవ సమావేశాన్ని హైదరాబాద్ కాచిగూడ అభినందన్ గ్రాండ్ హోటల్లో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీఐఎఫ్ జెండా, కండువా, లోగోలను ఆవిషరించారు. సంస్థ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
అనంతరం చిరంజీవులు మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికలను సమర్థవంతంగా వినియోగించి బీసీఐఎఫ్ భావజాలాన్ని గ్రామస్థాయికి విస్తరింపజేసి యువతను ఉద్యమంలో భాగస్వాములను చేస్తామని చెప్పారు. బీసీఐఎఫ్ను భవిష్యత్‌లో రాజకీయ పార్టీగా మార్పు చేసే అంశాన్ని తాతాలికంగా వాయిదా వేశామని వెల్లడించారు. ప్రజా సమస్యలు, సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాల హకుల పరిరక్షణ కోసం ప్రత్యక్ష ఉద్యమాలు చేపడతామని తెలిపారు. సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ వీరస్వామి, వైస్‌చైర్మన్ బెనర్జీ, సభ్యులు సూరగోని రమేశ్, కూరపాటి రమేశ్, చంద్రశేఖర్, ఇప్పనపల్లి సాంబయ్య, శ్రీకాంత్, లింగేశ్ యాదవ్, వివిధ సంఘాల నాయకులు, ఫోరం రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

