హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తేతెలంగాణ): తెలంగాణకు భవిష్యత్తు లో బీసీ వర్గానికి చెందిన నేత ముఖ్యమంత్రి అవుతారని, అందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి పూర్తి మద్దతు ఇస్తారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఓబీసీ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం శంషాబాద్‌లో జరిగిన సమావేశంలో ఆయన చేసిన ఈ వ్యా ఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బీసీల హక్కుల కోసం, కులగణన కోసం రాహుల్‌గాంధీ గట్టిగా పోరాడుతున్నారని, ఆయన స్ఫూర్తితోనే తాము ఈ డిమాండ్‌ను ముందుకు తీసుకొచ్చామని తెలిపారు. బీసీలకు రావాల్సిన వాటాను అన్ని కులాలను ఒప్పించి తీసుకుంటామని, అవసరమైతే లాక్కుంటామని తేల్చిచెప్పారు.
త్వరలో జరిగే క్యాబినెట్ విస్తరణలోనూ, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్ల నియామకంలోనూ బీసీలకు తగిన ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడు తూ బీసీలు ఎవరికీ వ్యతిరేకం కాదని, సమావేశంలో ఓబీసీ సెల్ కన్వీనర్, ఎమ్మెల్యే వీరపల్లి శంకరయ్య, ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు, పలువురు ఓబీసీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమకారుల కమిటీ సభ్యులు రెండురోజుల పర్యటనలో భాగంగా ఆదివారం ముంబైకి చేరుకున్నారు. తెలంగాణ ఉద్యమకారుల కమిటీ సభ్యులు, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం కోదండరామ్, ఎస్ రాములునాయక్, మోతె శోభన్‌రెడ్డి తదితరులు మంగళవారం వరకు మహారాష్ట్రలో పర్యటిస్తారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారి వివరాల సేకరణ, వారికి తగిన ప్రభుత్వ గుర్తిం పు, సంక్షేమ పథకాలను అందించే మా ర్గాలపై ఈ పర్యటనలో భాగంగా ప్రత్యే క చర్చలు, సమావేశాలు నిర్వహిస్తారు. ఈ పర్యటన సందర్భంగా ప్రతినిధులకు మహారాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్ విభాగం స్వాగతం పలికింది.