హైదరాబాద్, డిసెంబర్4 (నమస్తే తెలంగాణ): బీసీబంధు పథకాన్ని వెంటనే అమలుచేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేయాలని కోరారు.
రాష్ట్రంలో కొత్తగా 2 బస్సు డిపోలు
హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా రెండు ఆర్టీసీ బస్సు డిపోలను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పెద్దపల్లి, ములుగు జిల్లాలోని ఏటూరు నాగారంలో డిపోలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. 15ఏండ్లుగా రాష్ట్రంలో ఒక్క బస్సు డిపో కూడా ఏర్పాటు కాలేదని తెలిపారు.