Telangana | బెటాలియన్ కానిస్టేబుళ్ల దుర్భర పరిస్థితిపై వారి కుటుంబసభ్యులు చేస్తున్న ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. నిన్నటి దాకా బెటాలియన్ ఎదుట ధర్నా చేసిన కానిస్టేబుళ్ల భార్యలు ఇవాళ రాష్ట్ర సచివాలయం ఎదుట నిరసనలు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలు, కుటుంబసభ్యులు శుక్రవారం ఉదయం పెద్ద ఎత్తున హైదరాబాద్ చేరుకుని సెక్రటేరియట్ వద్ద ఆందోళన చేపట్టారు. తమ భర్తలను కూలీల కంటే హీనంగా చూస్తున్నారని.. వాళ్లతో వెట్టిచాకిరి చేయిస్తున్నారని మండిపడ్డారు.
పోలీసులకు బెటాలియన్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం
బెటాలియన్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు.. వారితో గొడవపడుతూ కొడుతున్న ఆందోళనకారులు https://t.co/07QKcIZ4bH pic.twitter.com/ySSmFrbPhI
— Telugu Scribe (@TeluguScribe) October 25, 2024
బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలు, కుటుంబసభ్యులు చేస్తున్న ఆందోళనలతో అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబసభ్యులకు మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబసభ్యులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఎదురించిన బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలను, ఇతర కుటుంబసభ్యులను మహిళా కానిస్టేబుళ్లు కొట్టుకుంటూ మరీ వాహనాల్లో తరలించారు. దీంతో సచివాలయం ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంత చెండాలపు ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు.
కష్టపడి చదువుకున్న కానిస్టేబుళ్లతో కూలీ పనులు చేపించుకుంటున్నారు. పై అధికారులు మందు కలిపించుకుంటున్నారు.
చూడటానికి వచ్చిన మహిళలను, ఆరోగ్యం బాగోలేని వారిని కూడా అరెస్ట్ చేస్తున్నారు.. ఇది చెండాలపు ప్రభుత్వం -… https://t.co/GNj4CzS9bb pic.twitter.com/LP7SjGH4U5
— Telugu Scribe (@TeluguScribe) October 25, 2024
ఈ సందర్భంగా బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంత చెండాలపు ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు. కష్టపడి చదువుకున్న కానిస్టేబుళ్లతో కూలీ పనులు చేయించుకుంటున్నారని.. పై అధికారులు మందు కలిపించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చెండాలపు ప్రభుత్వం అని విమర్శించింది.
నేను రెండు నెలల గర్భవతి, నన్ను స్కానింగ్ కోసం తీసుకెళ్ళడానికి ఎవరూ లేరని రోడ్డుపై బైఠాయించిన బెటాలియన్ కానిస్టేబుల్ భార్య.
మా ఆయన బెటాలియన్ కానిస్టేబుల్. మాకు 19 నెలల బాబు ఉన్నాడు. ఇంట్లో మా అత్తమామలు వయస్సు పైబడ్డ వాళ్లు. కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖరి వల్ల ఎక్కువ డ్యూటీలు… pic.twitter.com/oLKcDptQQe
— BRS Party (@BRSparty) October 25, 2024
ఈ బతుకు బతకడం కంటే సచ్చిపోవడం మేలు
నేను రెండు నెలల ప్రెగ్నెంట్ను.. మా ఆయన బెటాలియన్ కానిస్టేబుల్.. నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోతున్నాడని ఓ కానిస్టేబుల్ భార్య ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేసింది. మా బాబుకి 19 నెలలు.. నన్ను స్కానింగ్ కోసం తీసుకెళ్లడానికి ఎవరూ లేరని కన్నీళ్లు పెట్టుకుంది. ఈ బతుకు బతకడం కంటే సచ్చిపోవడం మేలు అని వాపోయింది.