హైదరాబాద్ : ఈనెల 10 నుంచి తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ( BRS ) మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు( Bathukamma Celebrations) నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ( Padma Devendar Reddy ) , జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ తుల ఉమ ( Tula Uma) వెల్లడించారు. గురువారం తెలంగాణ భవన్లో బతుకమ్మ సంబరాల పోస్టర్ను ,పాటలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో మహిళా నేతలు బృందాలుగా పర్యటించి సంబరాల్లో పాల్గొంటారని వివరించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండగ కు రాష్ట్ర పండగ గా గుర్తింపు నిచ్చి తెలంగాణ మహిళల గౌరవాన్ని విశ్వ వ్యాప్తం చేశారని అన్నారు . రేవంత్ రెడ్డి పాలనలో బతుకమ్మ పండగకు ప్రభుత్వ పరంగా ఎలాంటి ప్రోత్సాహం లేదని ,చివరకు బతుకమ్మ చీరల పంపిణీని కూడా ఆపేశారని ఆరోపించారు.
తెలంగాణ సంస్కృతిని, అస్తిత్వాన్ని నిలబెట్టే పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి , సత్యవతి రాథోడ్ , ఎమ్మెల్సీ వాణి దేవి , మాజీ ఎంపీ మాలోత్ కవిత , జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి , టీజీ పీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ , కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ రజనీ సాయిచంద్ , జీహెచ్ఎంసీ మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు .