లంచం డిమాండ్ చేసిన ఎస్సై అరెస్ట్
చీటింగ్ కేసులో నిందితుడికి సహాయం చేస్తానంటూ లంచం డిమాండ్ చేసిన ఘటనలో బంజారాహిల్స్ ఎస్సై విజయ్కొత్తూర్ అరెస్టయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నం. 2లో ‘ఫార్చ్యూన్ 99 హోమ్స్' పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థ కార్యాలయం ఉండేది. షాద్‌నగర్ ప్రాంతంలో ప్లాట్ల విక్రయం, పెట్టుబడుల పేరుతో మోసం చేశారన్న ఆరోపణలతో రోసిరెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఇటీవల చీటింగ్ కేసు నమోదయింది.
- రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫిర్యాదుతో ఏసీబీ కేసు
- ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన
బంజారాహిల్స్, అక్టోబర్ 28: చీటింగ్ కేసులో నిందితుడికి సహాయం చేస్తానంటూ లంచం డిమాండ్ చేసిన ఘటనలో బంజారాహిల్స్ ఎస్సై విజయ్కొత్తూర్ అరెస్టయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నం. 2లో ‘ఫార్చ్యూన్ 99 హోమ్స్’ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థ కార్యాలయం ఉండేది. షాద్‌నగర్ ప్రాంతంలో ప్లాట్ల విక్రయం, పెట్టుబడుల పేరుతో మోసం చేశారన్న ఆరోపణలతో రోసిరెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఇటీవల చీటింగ్ కేసు నమోదయింది.
అరెస్ట్ చేయకుండా చూస్తానంటూ బంజారాహిల్స్ ఎస్సై విజయ్ రూ.10 లక్షలు లంచం ఇస్తే అరెస్ట్ చేయకపోవడమే కాకుండా కేసులు నమోదు కాకుండా చూస్తానంటూ సంస్థ ప్రతినిధులను డిమాండ్ చేశాడు. రూ.10వేలు ఇస్తామని చెప్పగా ఆగ్రహానికి గురయిన విజయ్ ఇటీవల రోసిరెడ్డిని అరెస్ట్ చేయగా కోర్టులో రిమాండ్‌ను తిరస్కరించారు. రోసిరెడ్డిపై గతంలో ఇదే పోలీస్‌స్టేషన్‌లో మరో రెండు చీటింగ్ కేసులున్నాయని, ఓ కేసులో నోటీసు జారీ చేశారు. నోటీసుకు జవాబుతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన రోసిరెడ్డిని రూ.2లక్షలు ఇవ్వాలని, లేకుంటే ఇబ్బందులు ఎదుర్కొంటావని మరోసారి బేరసారాలకు దిగాడు.
అప్పటికే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసిన రోసిరెడ్డి రికార్డింగ్ పరికరాలతో విజయ్ను కలిశాడు. తాను రూ.లక్ష మాత్రమే ఇవ్వగలనని చెప్పాడు. రోసిరెడ్డి మీద అనుమానం వచ్చిన ఎస్ఐ విజయ్ అతడిని అక్కడినుంచి పంపించేశాడు. ఈ వ్యవహారంలో ఏసీబీ విచారణ జరుగుతున్నదని తెలుసుకున్న విజయ్ వారం క్రితం సెలవుపై సొంతూరుకు వెళ్లాడు. ఈ మొత్తం వ్యవహారంపై ఈ నెల 24న ‘నమస్తే తెలంగాణ’లో ‘అరాచక ఎస్ఐపై ఏసీబీ వల’ పేరుతో కథనం ప్రచురితం కావడంతో కలకలం రేగింది. ఎస్ఐ విజయ్‌పై మరో రెండు కేసుల్లోనూ అవినీతి ఆరోపణలు రావడంతో లోతుగా విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు బుధవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. ఎస్ఐ విజయ్ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

