బండి భగీరథ్‌ను అరెస్టు చేయాలి
బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం రోడ్డెక్కాయి.
భీమ్‌గల్/రుద్రూర్/చౌటుప్పల్/భద్రాద్రి కొత్తగూడెం, మే 12 (నమస్తే తెలంగాణ) : బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం రోడ్డెక్కాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు, చర్ల, అశ్వారావుపేట, పాల్వంచ, దమ్మపేట, కరకగూడెం, గుండాల, బూర్గంపహాడ్, ఇల్లెందు మండలాల్లో పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని హైవేపై మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టి బొమ్మను బీఆర్ఎస్ కార్యకర్తలు దహనం చేశారు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌లో బీఆర్ఎస్ నేతలు బండి సంజయ్, భగీరథ్ ఫొటోలు దహనం చేశారు.
బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయాలి: ఎమ్మెల్యే కాలేరు
గోల్నాక, మే 12: బాలికపై లైంగిక దాడి ఘటనలో కేంద్ర మంత్రి కుమారుడు బండి సాయి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదై నాలుగు రోజులైనా ఎందుకు అరెస్ట్ చేయలేదని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రశ్నించారు. మంగళవారం అంబర్పేట్ నియోజకవర్గంలో వందలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఆయన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ బండి సంజయ్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రిగా బండి సంజయ్ కొనసాగితే బాధిత మైనర్‌కు న్యాయం జరుగదని పేర్కొన్నారు. లైంగికదాడి ఘటనలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని తెలిపారు.
ఎందుకు దాచిపెడుతున్నారు?: కేవీపీఎస్
అంబర్‌పేట, మే 12: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ ను ఎందుకు దాచిపెడుతున్నారని, ఏ తప్పూ చేయనప్పుడు చట్టం ముందుకు ఎందుకు తీసుకురావడం లేదని కుల వివక్ష పోరాట సమితి(కేవీపీఎస్) రాష్ట్ర నాయకుడు మహేందర్ డిమాండ్ చేశారు. భగీరథ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అంబర్‌పేట నియోజకవర్గంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ దేశంలో బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతున్నదని మండిపడ్డారు.

నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌లో బండి సంజయ్, భగీరథ్ ఫొటోలు దహనం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నాయకులు

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల, బీఆర్ఎస్ శ్రేణులు

అంబర్‌పేట ఛే నంబర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ధర్నాలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, పార్టీ శ్రేణులు

తిలక్‌నగర్ చౌరస్తాలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్న కార్యకర్తలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

