చిక్కడపల్లి, నవంబర్12: కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాల్‌రాజ్‌గౌడ్ హెచ్చరించారు. బీసీలకు ఇచ్చిన హామీ అమలు కోసం 15న నిర్వహిస్తున్న బీసీ ఆక్రోశ సభ ను విజయవంతం చేయాలని పిలునిచ్చారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ మాట్లాడుతూ బహుజన రాజ్యస్థాపన కోసం ఐక్య ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలుకు పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఫ్రంట్ కన్వీనర్ అయిలి వెంకన్నగౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఫ్రంట్ నాయకులు పాల్గొన్నారు.