హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ కేసులో రిమాండ్‌లో ఉన్న నిందితుడు రాధాకిషన్‌రావు మధ్యంతర బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం తీర్పు వెలువడనుంది. సమీప బంధువుల పెండ్లికి హాజరు కావాల్సి ఉందంటూ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ ముగించిన జస్టిస్ కే సుజన తీర్పును గురువారం వెల్లడిస్తానని ప్రకటించారు. కాగా బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రాధాకిషన్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును న్యాయమూర్తి వాయిదా వేశారు. ఇదే కేసులో మరో నిందితుడు మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై కూడా హైకోర్టు గురువారంతీర్పు వెలువరించనుంది. వైద్య పరీక్షలు, శస్త్ర చికిత్సల నిమిత్తం గత ఆగస్టులో మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు.. అప్పటి నుంచి ఆ ఉత్తర్వులను పొడిగిస్తూ వచ్చింది. దీంతో తనకు రెగ్యులర్ బెయిల్ కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు.