Pravalika Case | నాంపల్లి కోర్టులు, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ప్రవళిక ఆత్మహత్య కేసులో నిందితుడైన శివరాం రాథోడ్‌కు బెయిల్ మంజూరైంది. 9వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట పోలీసులు శనివారం నిందితుడిని హాజరుపర్చారు. ఈ మేరకు మెజిస్ట్రేట్ జీ ఉదయ్‌భాస్కర్‌రావు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
రూ.5 వేల వ్యక్తిగత పూచీకత్తును కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. పోలీసులు రిమాండ్ రిపోర్టులో నిందితుడిపై ఎలాంటి ఆధారాలను నమోదు చేయలేదని కోర్టు తెలిపింది. అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించడంపై పోలీసులను కోర్టు ప్రశ్నించింది. దీంతో రిమాండ్‌కు తరలించకుండానే కోర్టు నుంచి నిందితుడిని విడుదల చేశారు.