పీర్జాదిగూడ, మే 22: పసి బిడ్డలను విక్రయించే ముఠాను మేడిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి రామకృష్ణనగర్ కాలనీలో ఉంటున్న ఐతె శోభారాణి (48) ఆర్ఎంపీగా పనిచేస్తూ ప్రథమ చికిత్స సెంటర్‌ను( ఫస్ట్ ఎయిడ్ సెంటర్)ను నిర్వహిస్తున్నది. కొంతకాలంగా ఉప్పల్ ఆదర్శనగర్ కాలనీకి చెందిన చింత స్వప్న, రామకృష్ణానగర్ కాలనీకి చెందిన షేక్ సలీం పాషాతో కలిసి విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లోని పేద కుటుంబాల చిన్నారుల ఆచూకీ తెలుసుకొని వారికి డబ్బులు ఆశచూపి సం తానం లేని దంపతులకు విక్రయిస్తున్నారు.
విష యం తెలుకున్న ఓ స్వచ్ఛం ద సంస్థకు చెందిన మహిళలు స్టింగ్ ఆపరేషన్‌లో భాగంగా తమకు ఆడపిల్ల కావాలని శోభారాణిని సంప్రదించా రు. శిశువుకు రూ.4.50 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. రూ.10 వేలు అ డ్వాన్స్ ఇచ్చి మిగతా డబ్బులు పాపను ఇచ్చిన తర్వాత ఇస్తామని చెప్పారు. బుధవారం శోభారాణి ఫోన్ చేయగా స్వచ్ఛంద సంస్థ సభ్యులు సెంటర్‌కు చేరుకుని విజయవాడ నుంచి తీసుకువచ్చిన పాపను చూసి మేడిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని శోభారా ణితోపాటు సహకరించిన స్వప్న, సలీంను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని హైదరాబాద్ శిశు విహార్‌కు తరలించారు.