హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గవర్నమెంట్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ అసొసియేషన్ (టీజీ పాలా) రాష్ట్ర అధ్యక్షుడిగా బీ శ్రావణ్‌కుమార్ ఎన్నికయ్యారు. శనివారం అసొసియేషన్ ఎన్నికలను హైదరాబాద్‌లో నిర్వహించగా, శ్రావణ్‌కుమార్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అసొసియేట్ అధ్యక్షుడిగా డాక్టర్ విజయ్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా కే రాజేందర్, కోశాధికారి పీ ఆనంద్, ఉపాధ్యక్షులుగా డీఆర్ రవి, పీ అజయ్‌కుమార్, సెక్రటరీలుగా సీహెచ్ శ్రీనివాస్, కే శ్రీనివాస్, కృష్ణవేణి, జాయింట్ సెక్రటరీలుగా దీపికారెడ్డి, కే రాజ్‌కుమార్, సురేశ్‌ను ఎన్నుకున్నారు.