హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : ఎప్‌సెట్ ఎంపీసీ స్ట్రీమ్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు బీ ఫార్మసీ, ఫార్మా-డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలయ్యింది. సెప్టెంబర్ 3 నుంచి ఈ కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. ఇంజినీరింగ్ వెబ్ కౌన్సెలింగ్‌కు హాజరైన వారు ఈ కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చు.
వీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం, సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకోవడం ఉండదు. వెబ్ ఆప్షన్లు ఎంచుకుని సీట్లు పొందవచ్చు. సెప్టెంబర్ 3, 4 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. 6న సీట్లను కేటాయిస్తామని ప్రవేశాల కమిటీ కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు. సీట్లు పొందిన వారు 6,7 తేదీల్లో ఫీజు చెల్లించాలని, 7,8 తేదీల్లో కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.