కరీంనగర్ కమాన్ చౌరస్తా, డిసెంబర్ 24: గొప్ప లక్ష్యాలను చేరుకోవాలంటే ఎంపిక కూడా అదే తరహాలో ఉండాలని, అలాంటి ఎంపికకు సరైన కేంద్రం హైదరాబాద్‌లోని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అని ఆ వర్సిటీ డైరెక్టర్ జే శ్రీనివాస్‌రావు అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ రేకుర్తి కళాశాల ప్రాంగణంలో ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే – కేఎల్ యూనివర్సిటీ’ సంయుక్త ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్‌శాఖ ప్రిన్సిపాల్ ఎల్ కోటేశ్వర్, నమస్తే తెలంగాణ ఉమ్మడి జిల్లా బ్రాంచి మేనేజర్, బ్యూరోఇన్‌చార్జి కే ప్రకాశ్‌రావు, నమస్తే తెలంగాణ అడ్వైర్టెజ్‌మెంట్ డిప్యూటీ మేనేజర్ మల్లయ్య, అల్ఫోర్స్ కళాశాల ప్రిన్సిపాల్ రాజశేఖర్‌రెడ్డితో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించి, మాట్లాడారు.
ఇంటర్ తర్వాత ఉద్యోగావకాశాల కోసం ఎలాంటి ఉన్నత చదువులు చదవాలి? ఎక్కడ చదవాలి? ఎలా చదవాలి? అనే సంకోచంలో చాలామంది విద్యార్థులు ఉంటున్నారని, వారు తమ భవిష్యత్తు కోసం కేఎల్ యూనివర్సిటీని ఎంచుకోవచ్చని ధీమాగా చెప్తున్నామని అన్నా రు. తమ యూనివర్సిటీలో ప్రవేశం మొదలు, ఆర్థిక స్థోమత లేని విద్యార్థులకు విద్యాలక్ష్మి పథకాన్ని వినియోగించుకొని చదువుకునే అవకాశాలు ఉన్నాయని సూచించారు. తమ యూనివర్సిటీ ద్వారా ఉన్నత సంస్థల్లో ఉద్యోగాలు పొంది అత్యధికంగా రూ.60 లక్షల జీతం తీసుకుంటున్నారని తెలిపారు. కేఎల్ యూనివర్సిటీలో రెండేండ్లు చదువుకొన్న విద్యార్థి ఇతర దేశాల్లో యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కళాశాలల్లో మిగతా చదువు పూర్తి చేసుకునే అవకాశం ఉన్నదన్నారు. మూడేండ్లు ఇక్కడ చదివి, మరో ఏడాది విదేశాల్లో పూర్తిచేసే వెసులుబాటు తమ యూనివర్సిటీకి మాత్రమే ఉన్నదని చెప్పారు.
యూనివర్సిటీ హైదరాబాద్ శాఖ ప్రిన్సిపాల్ కోటేశ్వర్ మాట్లాడుతూ.. తమ వద్ద చదివిన విద్యార్థులకు వంద శాతం ఉన్నత వేతనంతో ప్లేస్మెంట్ వస్తుందని తెలిపారు. ఈ సంవత్సరం అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తుల కోసం 9133924000 నంబర్లో సంప్రదించవచ్చని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. అల్ఫోర్స్‌లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు కోసం ఇలాంటి కార్యక్రమాలను విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి నిర్వహిస్తున్నారని తెలిపారు. కేఎల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అర్హత పరీక్ష రాసిన విద్యార్థులకు తమ యూనివర్శిటీలో అద్భుత అవకాశాలు ఉంటాయన్నారు. హైదరాబాద్ కేంద్రంలో నిర్వహిస్తున్న అనేక సాఫ్ట్వేర్ సంస్థలతో అనుసంధానం చేస్తూ తమ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.