Ande Sri | తెలుగు యూనివర్సిటీ, జూలై 18: శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం ప్రదానం చేస్తున్న మహాకవి దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం- 2024కు ప్రజావాగ్గేయకారుడు అందెశ్రీని ఎంపిక చేసినట్టు భాషానిలయం గౌరవ కార్యదర్శి ఉడయవర్లు గురువారం తెలిపారు. 23న సుల్తాన్‌బజార్ భాషానిలయం ఆడిటోరియంలో అందెశ్రీని రూ. 10 వేలు, జ్ఞాపికతో సత్కరిస్తామన్నారు.
రసమయి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రీహీత డాక్టర్ సీ నారాయణరెడ్డి 93వ జయంతిని ఈనెల 22న తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్టు సంస్థ అధ్యక్షుడు రాము గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సినారె పురస్కారాన్ని ఏపీ అధికార భాషా సంఘం పూర్వ అధ్యక్షుడు, పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు ప్రదానం చేయనున్నట్టు ఆయన
వెల్లడించారు.