కొండాపూర్ : వైద్య రంగంలో ఆటోమేటెడ్ హెల్త్ మానిటరింగ్ ( Automated health monitoring ) పద్ధతులు కొత్త దిశను చూపనున్నాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జాతీయ అధ్యక్షులు డాక్టర్ దిలీప్ భానుశాలి( Dr. Dilip Bhanurali) అన్నారు. బుధవారం మాదాపూర్లోని సైబర్ గేట్ వే ఐటీ పార్కులో భా ఆరోగ్యం( Bha Arogyam) , జెనెసిస్ ఇన్ఫోఎక్స్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్పొరేట్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ దిలీప్ భానుశాలి మాట్లాడుతూ ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ(Artificial Intelligence Technology) రాకతో వైద్య ఆరోగ్య రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయన్నారు. వేగంగా రోగ నిర్ధారణ చేయడంలో ఏఐ పరిజ్ఞానం ఎంతో దోహదం చేస్తుందన్నారు. ఆరోగ్య సంరక్షణలో సరికొత్త టెక్నాలజీలను ఏకీకృతం చేయడంలో భాఆరోగ్యం సంస్థ దార్శనిక విధానం ప్రశంసనీయమన్నారు.
సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) హైదరాబాద్ డైరెక్టర్ సి.కవిత మాట్లాడుతూ. భా ఆరోగ్యంలో ఈక్విటీ వాటాదారుగా ఎస్టీపీఐ సాంకేతిక మార్గదర్శకత్వం, పరిశ్రమ, ప్రభుత్వ సంస్థలతో వ్యూహ్మాతక సహకారాల ద్వారా అవసరమైన మద్దతును అందిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో జెనెసిస్ ఇన్ఫో ఎక్స్ సంస్థ సీఈఓ డాక్టర్ వినయ్ సరికొండ, భా ఆరోగ్యం డైరెక్టర్ సత్యనారాయణ శాస్త్రి, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు కుమారస్వామి, భాఆరోగ్యం డైరెక్టర్లు పి.రవీంద్ర, సురేష్ గౌడ్, ట్రెడిషనల్ వెల్నెస్ ట్రైనర్ యోగి సుదర్శనాచార్య, జెనెసిస్ ఇన్ఫో ఎక్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పూజా, తదితరులు పాల్గొన్నారు.