ఏటీఎంలలో పెట్టే 1.20 కోట్ల నగదు మాయం
ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎంలలో పెట్టే రూ.1.20 కోట్లకుపైగా నగదు గల్లంతైన ఘటన వెలుగులోకి వచ్చింది. మొత్తం రూ.1, 20,98,500 నగదు లోటు ఉన్నట్టు అధికారులు నిర్ధారించి ఎస్ ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- కస్టోడియన్లపై అనుమానం.. కేసు నమోదు
వెంగళరావునగర్, ఏప్రిల్ 12 : ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎంలలో పెట్టే రూ.1.20 కోట్లకుపైగా నగదు గల్లంతైన ఘటన వెలుగులోకి వచ్చింది. మొత్తం రూ.1, 20,98,500 నగదు లోటు ఉన్నట్టు అధికారులు నిర్ధారించి ఎస్ ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌లోని సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ సంస్థ సిబ్బంది వివిధ బ్యాంకుల నుంచి నగదు తీసుకొని ఏటీఎంలలో జమచేస్తుంటారు. మేనేజ్మెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా కస్టోడియన్లు నగదు తీసుకువెళ్లి ఏటీఎంలలో నింపుతుంటారు.
ఇందులో భాగంగా తరచూ ఆడిట్ కూడా నిర్వహిస్తుంటారు. తాజాగా నిర్వహించిన ఆడిట్లో నగదు లోటు ఉన్నట్టు గుర్తించడంతో ఎస్ ఆర్ నగర్ పరిధిలోని 31 ఏటీఎంలను తనిఖీ చేశారు. ఇందులో 8 ఏటీఎంలలో పెట్టే నగదు గల్లంతైనట్టు వెల్లడైంది. దీంతో సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ సంస్థ మేనేజర్ నవీన్ శనివారం ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగదు తీసుకొచ్చే ఇద్దరు కస్టోడియన్లపై అనుమానం వ్యక్తమవుతున్నది. వారు విధులకు హాజరుకాకపోవడం, ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడంతో వారిపై అనుమానం వ్యక్తంచేశారు. దీంతో పోలీసులు పరారీలో ఉన్న కస్టోడియన్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

