హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఏపీ, తెలంగాణ లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) వేడుకలను ఈ నెల 10 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్టు ఆటా వేడుకల చైర్మన్ జయంత్ చల్లా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే జూన్ 7, 8, 9న ఆటా అంతర్జాతీయ సదస్సు అమెరికాలో జరుగనున్న నేపథ్యంలో ముందుగా తెలుగు రాష్ర్టాల్లో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. వేడుకల్లో విద్యా, వ్యాపార, ఆధ్యాత్మిక సెమినార్లు, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. హైదరాబాద్, శ్రీశైలం, బాసర, నల్లగొండ, వరంగల్, గజ్వే ల్, వైజాగ్, తిరుపతి, విజయవాడ నగరాల్లో వేడుకలకు ఏర్పాట్లు చేసినట్టు చెప్పా రు. ఆటా సంస్థ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, బాసర ఐఐఐటీ, ఏయూ, తెలంగాణ ఉన్నత విద్యాశాఖ, పలు ఎన్జీఓల భాగస్వామ్యంతో కార్యక్రమాలు నిర్వహించనున్నారు.