TSLPRB | హైదరాబాద్ : 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యుటర్ పోస్టులకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(టీఎస్ఎల్పీఆర్బీ) దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 5వ తేదీన సాయంత్రం 5 గంటలతో దరఖాస్తుల గడువు ముగియనుంది. కానీ వరుసగా సెలవులు రావడం, అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నెల 11వ తేదీ వరకు దరఖాస్తుల గడువు పొడిగించారు. అయితే ఈ పోస్టులకు 7183 మంది రిజిస్ట్రర్ చేసుకోగా, ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు 2193 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. అంటే కేవలం 30 శాతం మంది తమ దరఖాస్తులను సమర్పించారు. ఈ మేరకు టీఎస్ఎల్పీఆర్బీ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
తదితర వివరాలకు www.tgprb.in వెబ్సైట్ సందర్శించాలని సూచించింది. రాష్ట్రంలోని క్రిమినల్ కోర్టుల్లో మూడేండ్లకుపైగా ప్రాక్టీస్ చేసిన న్యాయవాదులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని పేర్కొన్నది.