హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ) రాత పరీక్ష ఈ నెల 28న నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. 113 ఉద్యోగాల భర్తీకి ఈ పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తారు. అభ్యర్థులందరూ సకాలంలో హైదరాబాద్లోని పరీక్షాకేంద్రానికి చేరుకోవాలని టీఎస్పీఎస్సీ కోరింది.