మల్లన్న ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణం

- తొలిసారి ముదిరాజ్‌లకు చైర్మన్ పదవి కేటాయింపు
- భక్తులకు అన్నిరకాల వసతులు కల్పిస్తాం: చైర్మన్ గీస భిక్షపతి
చేర్యాల, మే 20: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం నిరాడంబరంగా జరిగింది. ఆలయంలోని గంగిరేగుచెట్టు ఆవరణలో కొవిడ్ నిబంధనలను అనుసరించి ఈవో బాలాజీ ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులచే ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా చైర్మన్ గీస భిక్షపతి మాట్లాడుతూ.. తొలిసారిగా చైర్మన్ పదవిని టీఆర్ఎస్ ప్రభుత్వం ముదిరాజ్‌లకు కేటాయించడం హర్షణీయమని చెప్పారు. కొమురవెల్లి గ్రామానికి చెందినవారిని నియమించడం కూడా ఇదే తొలిసారని చెప్పారు. మల్లన్న క్షేత్రాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామని, దర్శనానికి వచ్చే ప్రతి భక్తునికి అన్నివసతులు కల్పిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, హరీశ్‌రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నియోజకవర్గ టీఆర్ఎస్ కో ఆర్డినేటర్ గుజ్జ సంపత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నూతన చైర్మన్‌తోపాటు ధర్మకర్తలను టీఆర్ఎస్ నాయకులు, ఘనంగా సన్మానించారు. సభ్యులుగా తుమ్మల రవి, ఉత్కూరి అమర్, ధరావత్ అనిత, తాళ్లపల్లి శ్రీనివాస్, కొంగరి గిరిధర్, చింతల పర్శరాములు, తివారీ అలియాస్ బొందిలి దినేష్‌కుమార్, బొంగు నాగిరెడ్డి, శెట్టె అయిలయ్య, ముత్యం నర్సింహులు, పొతుగంటి కొమురవెల్లి, గడ్డం మహేశ్‌యాదవ్ ప్రమాణం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ రెండో ట్రైలర్ దసరాకేనా.. అక్టోబర్ 20న మరో భారీ అప్డేట్!
Ram Charan | రామ్ చరణ్ – అనిరుధ్ కాంబినేషన్ ఫిక్స్.. క్రేజీ కాంబోపై భారీ అంచనాలు!
Shreyas Iyer | శ్రేయస్ అయ్యర్ ఔట్‌తో కన్నీళ్లు పెట్టుకున్న మహిళా అభిమాని .. వైరల్‌గా మారిన వీడియో
Zayn Marie | ఆమిర్ ఖాన్ మేనకోడలికి గాయాలు.. పోలీసుల చర్యలపై జైన్ మేరీ ఆగ్రహం
Bala Krishna | ట్రాఫిక్ సమస్యకు బాలకృష్ణ సహకారం.. ఎన్టీఆర్ జ్ఞాపకాలతో ముడిపడిన ఇంటి స్థలాన్ని వదులుకోనున్నారా..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

