పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ఆమోదించిన అసెంబ్లీ
పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా ఆరు గ్రామ పంచాయతీల ఏర్పాటుకు పంచాయతీరాజ్ చట్టంలో సవరణలను ప్రభుత్వం ప్రతిపాదించింది.
హైదరాబాద్: పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా ఆరు గ్రామ పంచాయతీల ఏర్పాటుకు పంచాయతీరాజ్ చట్టంలో సవరణలను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ బిల్లును పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టారు. నేడు సవరణ బిల్లును సభ ఆమోదించింది. దీంతో భద్రాచలం మండలంలో భద్రాచలం, సీతారాంనగర్, శాంతినగర్, బూర్గంపాడు మండలంలో సారపాక, ఐటీసీ, ఆసిఫాబాద్ జిల్లాలో రాజంపేటను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్ట సవరణ బిల్లును కూడా అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

