నేటితో ముగియనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగినున్నాయి. చివరిరోజైనా నేడు ఉభయసభల్లో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ జరుగనుంది. శాసనసభ ఆమోదించిన బిల్లులు, అంచనా వ్యయంపై మండలిలో చర్చకు రానున్నాయి.
హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగినున్నాయి. చివరిరోజైనా నేడు ఉభయసభల్లో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ జరుగనుంది. శాసనసభ ఆమోదించిన బిల్లులు, అంచనా వ్యయంపై మండలిలో చర్చకు రానున్నాయి. ఉదయం మండలి ప్రారంభంకాగానే డిప్యూటీ చైర్మెన్‌ను ఎన్నుకోనున్నారు. డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అధికారికంగా ప్రకటించి ఆయనకు బాధ్యతలు అప్పగించనున్నారు.
ఈ నెల 6న ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో 2023-24 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. శాఖలవారీగా బడ్జెట్ డిమాండ్లు, గ్రాంట్లపై శనివారం అర్ధరాత్రి వరకు అసెంబ్లీలో చర్చ కొనసాగడంతోపాటు ఆమోదం కూడా పొందాయి. ఈ నేపథ్యంలో ఆదివారం శాసనసభలో మంత్రి హరీశ్ రావు ద్రవ్యవినిమయ బిల్లును ప్రవేశపెడతారు. బిల్లుపై చర్చకు సీఎం కేసీఆర్ సమాధానం ఇవ్వనున్నారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా బస్తీ దవాఖానాలు, గురుకులాలు, హరితవనాలు, పునరుత్పాదక ఇంధన వనరులు, సమీకృత వ్యవసాయ మార్కెట్లు, పంట రుణాల మాఫీ, అక్షరాస్యత తదితర అంశాలపై మంత్రులు సమాధానం ఇస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

