హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : సోలార్ రంగంలో చేసి న విశేష సేవలకు తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బుర్రా అశోక్‌కుమార్ ‘సోలార్ మ్యా న్ ఆఫ్ తెలంగాణ’ అవార్డును దక్కించుకున్నారు. బేగంపేట టూరిజం ప్లాజాలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో టీజీ రెడ్కో జీఎం ప్రసార్, టీజీఎస్సీడీసీఎల్ సీ జీఎం చక్రపాణిలు అశోక్‌కుమార్‌కు అవా ర్డు అందజేశారు. పదేండ్లుగా సోలార్ రంగంలో నిరంతరం కృషి చేయగా, అశోక్‌కుమార్ సేవలను గుర్తించి, ఈ అవార్డుకు ఎంపికచేశారు.